Chiranjeevi: చిరంజీవిగారు శ్రీరస్తు అన్నారు ... బాలకృష్ణ గారు శుభమస్తు అన్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • చిరంజీవిగారు పూనుకున్నారు
  • నాగార్జునగారు వెంటనే స్పందించారు
  •  పరిశ్రమలోని పెద్దలంతా మంచి మనసును చాటుకున్నారన్న పరుచూరి
Paruchuri Palukulu

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, లాక్ డౌన్ కాలంలో చిత్ర పరిశ్రమకి చెందిన కార్మికులు పడుతున్న ఇబ్బందులు .. సాయం చేయడానికి ముందుకు వచ్చిన పెద్దలను గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఇరవై వేలమంది కార్మికులు వున్నారు. వాళ్లలో ఒకనెల ఆదాయం లేకపోయినా బతకగలిగేవాళ్లు వేయి మంది మాత్రమే. మిగతా వాళ్లంతా ఏ రోజు పని కోసం ఆ రోజు ఎదురుచూసేవాళ్లే.

ఒకప్పుడు సహాయ కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. దాసరిగారు ముందుకు వచ్చేవారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిత్రపరిశ్రమలోని కార్మికులను ఆదుకోవడానికిగాను 'కరోనా క్రైసిస్ ఛారిటీ'ని ఏర్పాటు చేస్తూ చిరంజీవి ముందుకొచ్చారు. వెంటనే నాగార్జున స్పందించారు. ఆ తరువాత ప్రభాస్ .. పవన్ కల్యాణ్ .. మోహన్ బాబు .. ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. ఇలా ఇండస్ట్రీలోని చాలామంది తమ పెద్ద మనసులను చాటుకున్నారు. ఈ మంచి పనికి చిరంజీవి శ్రీరస్తు అంటే బాలకృష్ణ శుభమస్తు అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు చిత్ర పరిశ్రమకి చెందిన కార్మికులను ఆదుకోవడానికిగాను తనవంతు సాయాన్ని అందించారు .. వాళ్లందరికీ ధన్యవాదాలు " అని చెప్పుకొచ్చారు.

More Telugu News