ipl: నేను సిక్స్ కొట్టగానే జడేజాపై ధోనీ కన్నెర్రజేశాడు!: ఇషాంత్ శర్మ

Dhoni bhai abused Jadeja after I hit him for a boundary and six says Ishant Sharma
  • ఐపీఎల్‌లో ఓ సంఘటనను గుర్తు చేసిన ఇషాంత్
  • నాకు బ్యాటింగే రాదని ధోనీ వెక్కిరించే వాడు
  • జడేజా బౌలింగ్‌లో 4,6 కొట్టి మహీ వైపు చూశానని వెల్లడి
తనకు బ్యాటింగే రాదని టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ వెక్కిరించే వాడని, అయితే ఓసారి జడేజా బౌలింగ్‌లో షాట్లు కొట్టి అతను అసహనానికి గురయ్యేలా చేశానని భారత జట్టు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని అతను చెప్పాడు. గత సీజన్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన లంబూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కొన్ని షాట్లతో అలరించాడు. దాంతో, తనకు బ్యాటింగే రాదని వెక్కిరించే ధోనీ షాకయ్యాడని చెప్పాడు.

‘నువ్వు సిక్సర్లు కొట్టలేవని మహీ భాయ్ నన్ను తరచూ ఆటపట్టిస్తుండే వాడు. నాలో ఆ సామర్థ్యమే  లేదనేవాడు. కానీ, గతేడాది నేను జడ్డూ (జడేజా) బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్ కొట్టా. దీనికి  ధోనీ స్పందన ఎలా ఉందో చూడాలని అతని వైపు చూశా. అంతే.. అతను జడేజాను కోపంగా చూశాడు. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు’ అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

2014లో జరిగిన లార్డ్స్ టెస్టులో ఏడు వికెట్ల ప్రదర్శన,  గతేడాది ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గులాబీ బంతి టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన రెండూ తనకే ప్రత్యేకమైనవని ఇషాంత్ తెలిపాడు, ఈ రెండింటిలో ఒక దాన్ని తాను ఎంచుకోలేనని చెప్పాడు.
ipl
MS Dhoni
Ishant Sharma
sixer
Ravindra Jadeja

More Telugu News