Rahul Gandhi: పేదలు ఆకలితో అలమటిస్తుంటే బియ్యంతో శానిటైజర్ తయారీనా?: రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi questions over government decision that rice uses in sanitizer making
  • మిగులు బియ్యంతో శానిటైజర్ల తయారీ
  • దేశంలో పేదవాళ్లు ఎప్పుడు ప్రశ్నిస్తారంటూ రాహుల్ ట్వీట్
  • ప్రభుత్వ నిర్ణయంపై వచ్చిన కథనాన్ని ట్వీట్ కు జోడించిన కాంగ్రెస్ అగ్రనేత
బియ్యంతో శానిటైజర్లు తయారుచేస్తున్నారంటూ వస్తున్న కథనాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఓవైపు పేదవాళ్లు ఆకలితో చచ్చిపోతుటే, బియ్యంతో శానిటైజర్లు తయారుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఏంటని మండిపడ్డారు.

 "భారతదేశంలో పేదవాళ్లు ఎప్పుడు మేల్కొంటారు? ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "మీరు ఆకలితో అలమటిస్తుంటే, మీకు దక్కాల్సిన బియ్యంతో శానిటైజర్లు తయారుచేసి సంపన్నుల చేతులు శుభ్రపరచాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు" అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, దేశంలోని మిగులు బియ్యాన్ని శానిటైజర్ల తయారీకి అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ తన ట్వీట్ కు జోడించారు.
Rahul Gandhi
Rice
Sanitizer
Corona Virus
India

More Telugu News