Venu Sriram: పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వకీల్ సాబ్ దర్శకుడు

Vakeel Saab director Venu Sriram opines on Pawan Kalyan
  • మొదటి షెడ్యూల్ కోసం పవన్ ఎంతో కష్టపడ్డారన్న వేణు శ్రీరామ్
  • రోజూ 600 కి.మీ ప్రయాణించేవారని వెల్లడి
  • ఒక్క రోజు కూడా షూటింగ్ మిస్ కాలేదని కితాబు
బాలీవుడ్ లో హిట్టయిన పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్ పేరిట తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వేణు శ్రీరామ్ ఆసక్తికర విషయాలు తెలిపారు. వకీల్ సాబ్ షూటింగ్ మొదలైన తర్వాత పవన్ కల్యాణ్ ఒక్కరోజు కూడా షూటింగ్ మిస్ కాలేదని, తన బిజీ షెడ్యూల్ కారణంగా సినిమాకు ఆటంకాలు ఏర్పడకుండా ఆయన ఎంతో కష్టపడ్డారని వివరించారు.

విజయవాడ-హైదరాబాద్ మధ్య అవిశ్రాంతంగా ప్రయాణించారని, ఈ సినిమా కోసం నిత్యం 600 కిలోమీటర్లు ప్రయాణించేవారని పేర్కొన్నారు. సినిమా పట్ల పవన్ కున్న అంకితభావంతో మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించామని, లాక్ డౌన్ తర్వాత మిగతా సీన్లు పూర్తిచేస్తామని వేణు శ్రీరామ్ వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, నరేశ్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.
Venu Sriram
Pawan Kalyan
Vakeel Saab

More Telugu News