Telangana: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చిరుత సంచారం అవాస్తవమన్న అటవీశాఖ

Telangana Forest Department clarifies about cheeta rumours
  • నిన్న అర్ధరాత్రి చిరుత సంచరించిందన్నది అవాస్తవం 
  • ఈ వీడియో ఇక్కడికి సంబంధించినది కాదు
  • ఈ వార్తలను ఖండిస్తున్నాం
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కు పరిసరాల్లో చిరుతపులి సంచరించినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న వార్తలను తెలంగాణ అటవీశాఖ ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న వీడియో ఇక్కడిది కాదని, ఈ పార్క్ పరిసరాల్లో చిరుత సంచారం నిజం కాదని స్పష్టం చేసింది. కాగా, నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వద్ద ఉన్న రోడ్ నంబర్ 12 ను దాటుకుంటూ చిరుత వెళ్లిందంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Telangana
Forest Department
Hyderabad
kbr park
cheetah

More Telugu News