Amazon: కేంద్రం యూటర్న్ తీసుకోవడంపై స్పందించిన అమెజాన్

  • నిత్యావసరాలు మినహా ఏ వస్తువులు విక్రయించకూడదన్న కేంద్రం
  • నిరాశ కలిగించే నిర్ణయమన్న అమెజాన్ ఇండియా
  • చిన్నవ్యాపారులకు కూడా బాధాకరమని వ్యాఖ్యలు
Amazon responds on Centre decision

ఈ కామర్స్ సంస్థలు నిత్యావసరాలే కాకుండా ఇతర వస్తువులు కూడా విక్రయించుకోవచ్చంటూ ఇటీవల పేర్కొన్న కేంద్రం ఆపై మరో ప్రకటన చేస్తూ ఇతర వస్తువుల విక్రయానికి కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్రం తన మొదటి ప్రకటనకే కట్టుబడి ఉంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లు ఇవాళ్టి నుంచి ఎలక్ట్రానిక్స్ తదితర వస్తువులను కూడా విక్రయించడానికి వీలుండేది. దీనిపై అమెజాన్ ఇండియా  స్పందించింది. కేంద్రం ప్రకటించిన తాజా మార్గదర్శకాలతో వినియోగదారులే కాకుండా, చిన్నతరహా వ్యాపారులు, ఉత్పత్తిదారులు కూడా నిరాశకు గురవుతారని పేర్కొంది.

ఇంటి నుంచే పనులు చేస్తున్నవాళ్లకు, ఇంటి నుంచే ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నవాళ్లకు కేంద్రం నిర్ణయం బాధాకరమేనని అభిప్రాయపడింది. వాళ్లకు అవసరమైన ఎన్నో వస్తువులు ఇప్పుడు నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించినట్టయిందని పేర్కొంది. అయితే కేంద్రం తన విధానాన్ని త్వరలోనే సమీక్షించుకుంటుందని భావిస్తున్నామని అమెజాన్ వెల్లడించింది. ఆర్థిక రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని వివరించింది.

More Telugu News