నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై విచారణ ఈ నెల 28 కి వాయిదా
- ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- ఎస్ఈసీ నియామక నిబంధనల మార్పును సవాల్ చేస్తూ పిటిషన్
- ఏజీ, పిటిషనర్ల వాదనలు విన్న న్యాయస్థానం
అడ్వకేట్ జనరల్ (ఏజీ), పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలను దాదాపు గంటపాటు న్యాయస్థానం వింది. ఈ కేసుకు సంబంధించి అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరింత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఏజీ కోరారు. దీంతో ఈ నెల 24వ తేదీలోపు అడిషనల్ అఫిడవిట్ ను దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, అడిషనల్ అఫిడవిట్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఈ నెల 27వ తేదీ లోపు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది.