Pawan Kalyan: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Chandrababu on his Birthday
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • 71వ పడిలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత
  • సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ పవన్ ట్వీట్
ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదినం. ఇవాళ ఆయన 71వ పడిలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

"గౌరనీయులైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉదయం సీఎం జగన్ కూడా చంద్రబాబుకు విషెస్ తెలపగా, చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
Pawan Kalyan
Chandrababu
Birthday
Telugudesam
Janasena
Andhra Pradesh

More Telugu News