KCR: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్: సీఎం కేసీఆర్ గురించి హీరో రాజశేఖర్ ట్వీట్

Proud of you sir says hero rajashekarin CM KCR
  • ప్రెస్‌మీట్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు
  • కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు
  • ఈ మహమ్మారి నుంచి ప్రభుత్వం మనల్ని గట్టెక్కిస్తుంది
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును చూస్తుంటే గర్వంగా ఉందని హీరో డాక్టర్ రాజశేఖర్ అన్నారు. ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.  కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రభుత్వం మనందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తుందని చెప్పారు.

‘ సీఎం కేసీఆర్ గారు మీడియా సమావేశంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించారు.  కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మనమంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సీఎంపై నాకు చాలా నమ్మకం ఉంది.ఈ మహమ్మారి నుంచి తెలంగాణ ప్రభుత్వం మనందరినీ సాధ్యమైన ఉత్తమ మార్గంలో బయటకు తీసుకొస్తుంది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్’ అని రాజశేఖర్ ఈ రోజు ట్వీట్ చేశారు. దీన్ని తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.
KCR
Hero
Rajasekhar
praise
Corona Virus
Telangana
govt

More Telugu News