Chandrababu: తాతయ్య చంద్రబాబుకు దేవాన్ష్‌ ఎలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడో చూడండి!

devansh about chandrababu
  • ఫొటో ట్వీట్ చేసిన నారా బ్రాహ్మణి
  • ఆసక్తికర వ్యాఖ్యలు
  • చంద్రబాబు దేవాన్ష్‌కి బెస్ట్ ఫ్రెండ్ అని వ్యాఖ్య
  • నాకు మీరు ఓ ఐకాన్, స్ఫూర్తి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పుట్టినరోజు సందర్భంగా ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఓ పోస్టు చేశారు. చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్ తో కలిసి ఆడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు.

 ‘ప్రపంచంలోనే అద్భుతమైన తాత చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నన్ను ప్రేమించటం చాలా గొప్ప విషయం. నాకు మీరు ఓ ఐకాన్, స్ఫూర్తి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నా బెస్ట్ ఫ్రెండ్‌’ అంటూ చంద్రబాబుకి దేవాన్ష్ చెబుతున్నట్లు నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు.

కాగా, చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News