Prakasam District: విద్యార్థుల పాట్లు.. పాలవ్యాన్‌లో దాక్కుని సరిహద్దు దాటే యత్నం!

  • లాక్‌డౌన్‌తో తెలంగాణలో చిక్కుకున్న వైనం
  • హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు రాక
  • పొందుగుల చెక్ పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
Stunents travelledi in milk tanker catched by police

లాక్‌డౌన్‌తో విద్యా సంస్థలు మూసివేశారు. వసతి గృహాలకు తాళాలు పడ్డాయి. ప్రభుత్వం హాస్టల్స్ తెరిచే ఉంచాలని చెప్పినా కొందరు పట్టించుకోని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో అర్థంకాక ఏదోలా సొంతూరికి చేరిపోవాలనుకున్న కొందరు విద్యార్థుల ప్రయత్నం బెడిసికొట్టి పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు మిర్యాలగూడలో చిక్కుకున్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారని ఏదోలా ఓపిక పట్టారు. కానీ మే 3 వరకు పొడిగించడంతో ఏం చేయలేక ఓ పాలవ్యాన్‌ను ఆశ్రయించారు.

 హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళ్తున్న పాలవ్యాన్‌ను మిర్యాలగూడలో ఆపారు. డ్రైవరుకు డబ్బుల ఆశచూపి అతని సాయంతో వ్యాన్ లోపల కూర్చున్నారు. ఏదోలా సరిహద్దు దాటేస్తే ఎలాగోలా ఇంటికి చేరిపోవచ్చునని అనుకున్నారు. కానీ వారి సాహసానికి పోలీసులు బ్రేక్ వేశారు.

కారంచేడు వెళ్తుండగా మధ్యలో పొందుగుల చెక్ పోస్టు వద్ద పోలీసులు ట్యాంకర్‌ను ఆపారు. అనుమానంతో తనిఖీ చేయగా లోపల విద్యార్థులున్న విషయం బయటపడింది. దీంతో వారిని బయటకు దించి అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News