Rajamouli: కరోనా ఇప్పట్లో తగ్గేటట్టు లేదు.. ఇంకో 6 నెలలు థియేటర్లు పని చేయకపోవచ్చు: రాజమౌళి

Its take another 6 months for theaters to reopen says Rajamouli
  • సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం
  • షూటింగులు, థియేటర్లు అన్నీ బంద్
  • జనాల్లో భయం పోవడానికి టైమ్ పడుతుందన్న రాజమౌళి
కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో పడింది. థియేటర్లు బంద్ అయ్యాయి. షూటింగులు ఎక్కడికక్కడ అగిపోయాయి. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై సినీ దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, కరోనా ప్రభావం ఇప్పుడే తగ్గే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. థియేటర్లు నడవడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గినా... ప్రజల్లో భయం పోవడానికి సమయం పడుతుందని అన్నారు.

ఇదే అంశంపై మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవల స్పందిస్తూ, మరో మూడు నెలల పాటు థియేటర్లను మూసి ఉంచితేనే మంచిదని అభిప్రాయపడ్డారు.
Rajamouli
Tollywood
Corona Virus

More Telugu News