Rana: ఒకప్పటి చంద్రబాబు ఫొటో షేర్ చేసి, విషెస్ చెప్పిన రానా

Actor Rana shares old pic of Chandrababu
  • చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన రానా
  • సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్
  • 'ఎన్టీఆర్' చిత్రంలో మీ పాత్రను పోషించడం గర్వకారణమని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు 70వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చంద్రబాబుకు సినీ నటుడు దగ్గుబాటి రానా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఒకప్పటి చంద్రబాబు ఫొటోను షేర్ చేశారు. అంతేకాక, నందమూరి బాలకృష్ణ చిత్రం 'ఎన్టీఆర్'లో తాను పోషించిన చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఫొటోను కూడా జతచేశారు. 'హ్యాపీ బర్త్ డే సర్. మీ పాత్రను పోషించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.
Rana
Chandrababu
Telugudesam
Tollywood
Birthday

More Telugu News