India: భారత్‌లో నిన్న ఒక్క రోజే 1,533 కేసులు.. 36 మంది మృతి

Corona death toll raised to 17265 in India
  • దేశంలో 17 వేలు దాటిన కేసుల సంఖ్య
  • ఇప్పటి వరకు 543 మంది బలి
  • మహారాష్ట్రలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏకంగా 1,533 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 17,265కు పెరిగింది. నిన్న కొత్తగా మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 543కు చేరింది. అలాగే, ఇప్పటి వరకు 2,546 మంది వైరస్ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కోవిడ్‌కు కేంద్రంగా మారిన మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇప్పటి వరకు 4,203 కేసులు నమోదు కాగా, 223 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 507 మంది కోలుకున్నారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 2,003 మంది కరోనాతో బాధపడుతుండగా 45 మంది మృతి చెందారు.
India
Corona Virus
Maharashtra
New Delhi

More Telugu News