CPI Narayana: సీపీఐ నారాయణ వినూత్న నిరాహారదీక్ష

CPI Narayana Innovative Fasting
  • దేశంలోని పేదల కోసం ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
  • ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టిన నారాయణ
లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం కోసం పేదలు ఇబ్బంది పడకుండా చూడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ దీక్ష చేయ కూడదు కనుక హైదరాబాద్ లోని ల్యాంకోహిల్స్ లోని తన నివాసంలో నారాయణ  ఈరోజు ఉదయం దీక్షకు దిగారు. ఇవాళ ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష చేపట్టారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేదల కోసం ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 
CPI Narayana

More Telugu News