‘పాక్’లో ఓ హత్య కేసులో నిందితుడి ఫొటోకు బదులు బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ ఫొటో!

A Pakistani channel mistake
  • పాకిస్థాన్ కు చెందిన పార్టీ ఎంక్యూఎం నేత ఆమీర్ ఖాన్
  • ఓ హత్య కేసులో నిందితుడు..17 తర్వాత వెలువడ్డ తీర్పు
  • ఆమీర్ ఖాన్  ను నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం
  • ఈ వార్త ప్రసారం సయమంలో ఆ ఆమీర్ కు బదులు ఈ అమీర్ ఫొటో  
ఓ హత్య కేసులో నిందితుడి ఫొటోకు బదులు బాలీవుడ్ అగ్రనటుడు ఆమీర్ ఖాన్ ఫొటోను పాకిస్థాన్ లోని ఛానెల్ ప్రసారం చేసింది. దీనిపై నెటిజన్లు మండిపడటంతో చేసిన తప్పును ఆ ఛానెల్ నిర్వాహకులు సరిదిద్దుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. పాకిస్థాన్ లోని ముతాహిదా క్వామి మూవ్ మెంట్ (ఎంక్యూఎం) నేత ఆమీర్ ఖాన్. ఓ హత్య కేసులో ఆమీర్ ఖాన్ నిందితుడిగా ఉన్నాడు.

ఈ కేసుకు సంబంధించిన తీర్పు పదిహేడేళ్ల తర్వాత వెలువడింది. ఈ కేసులో ఆమీర్ ఖాన్ ని నిర్దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ వార్తను ప్రసారం చేసే సమయంలో సదరు ఛానెల్ ఎంక్యూఎం నేత ఆమీర్ ఖాన్ ఫొటోకు బదులుగా బాలీవుడ్ హీరో ఫొటోను ఉంచింది.ఈ ఛానెల్ చేసిన నిర్వాకంపై కొందరు నెటిజన్లు మండిపడగా, మరికొందరు సెటైర్లు విసిరారు.
Go Back to Shorts
Aamir Khan
Bollywood
Pakistan
MQM
Party
leader

More Telugu News