యూఏఈకి భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపిన భారత్
- మలేరియా మాత్రలుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ కు గుర్తింపు
- కరోనా చికిత్సలోనూ క్లోరోక్విన్ మాత్రల వాడకం
- ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న భారత్
అయితే భారత్ ఈ మాత్రల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించి ఉదారంగా అనేక దేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే అమెరికా, మారిషస్, సీషెల్స్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు క్వోరోక్విన్ మాత్రల ఎగుమతి జరిగింది. తాజాగా యూఏఈకి 5.5 మిలియన్ల మాత్రలను రవాణా చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక విమానం యూఏఈకి బయల్దేరినట్టు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.