David Warner: కత్రినా కైఫ్ హిట్ సాంగ్‌కు వార్నర్ స్టెప్పులు... వీడియో వైరల్

David Warner and his Daughter Indi Dance To Katrina Kaifs Blockbuster Song
  • షీలా కి జవానీ పాటకు కూతుళ్లతో కలిసి నర్తించిన వార్నర్
  • లాక్‌డౌన్‌ సమయంలో టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తున్న క్రికెటర్
  • నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలు
కరోనా దెబ్బకు క్రీడా ప్రపంచం కుదేలైంది. చాలా టోర్నీలు రద్దు లేదా వాయిదా పడడంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కూతుళ్లతో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు.

ఐపీఎల్‌ ఆడడం కోసం భారత్‌కు చాలా సార్లు వచ్చిన వార్నర్ కు  హిందీ పాటలంటే ఇష్టం. దాంతో, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటించిన ‘షీలా కి జవానీ’ పాటకు కూతుళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కూతురు ఇవీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన వార్నర్... తాజాగా తన రెండో కూతూరు ఇండీతో కూడా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది నెట్‌లో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షల మంది చూశారు.
David Warner
his Daughter
Dance
Katrina Kaif
Blockbuster Song

More Telugu News