Galla Jayadev: కోడిగుడ్లు పంపిణీ చేయడానికి ఎన్-95 మాస్కులు, సర్జరీ చేతితొడుగులా?: గల్లా జయదేవ్

Galla Jaydev slams Vijayasai Reddy over using of medical grade masks and gloves
  • ఎన్-95 మాస్కులు, గ్లోవ్స్ ధరించిన విజయసాయి తదితరులు
  • బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్న గల్లా
  • రాజకీయాలే ముఖ్యమని చాటారంటూ విమర్శలు
ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు కోడిగుడ్లను పంపిణీ చేసే క్రమంలో ఎన్-95 మాస్కులు, శస్త్రచికిత్సల సమయంలో ధరించే చేతితొడుగులతో కనిపించడాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. వైద్యసిబ్బంది కోసం నిర్దేశించిన ఎన్-95 మాస్కులను, సర్జికల్ గ్లోవ్స్ ను కోడిగుడ్ల పంపిణీ కోసం వృథా చేస్తారా? బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అది కూడా, భౌతిక దూరం పాటించాలన్న సూచనను పట్టించుకోకుండా, డాక్టర్లను, ఇతర అత్యవసర సిబ్బందిని అలక్ష్యం చేస్తూ, రాజకీయాలే తమకు మొదటి ప్రాధాన్యం అని చాటారని విమర్శించారు.
Galla Jayadev
Vijay Sai Reddy
N-95
Surgical Gloves
Eggs

More Telugu News