Jagan: జగన్ గారూ.. రాజ్యాంగ సంక్షోభం రావాలని కోరుకుంటున్నారా?: వర్ల రామయ్య

Varla Ramaiah fires on Jagan
  • హైకోర్టు తీర్పులను కూడా పట్టించుకోరా?
  • పార్టీ రంగులు తొలగించాలని హైకోర్టు చెప్పింది
  • కోర్టు తీర్పు తర్వాత కూడా రంగులు వేస్తున్నారు
హైకోర్టు తీర్పులను కూడా పట్టించుకోరా? అంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. హైకోర్టు తీర్పులంటే మీ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలని హైకోర్టు చెప్పినా తాత్సారం చేస్తుండటమే కాకుండా... కోర్టు తీర్పు తర్వాత కూడా కామవరపుకోట గ్రామంలో వాటర్ ట్యాంకుకు రంగులు వేస్తారా? అని మండిపడ్డారు. రాజ్యాంగ సంక్షోభం రావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 
Jagan
YSRCP
Varla Ramaiah
Telugudesam
AP High Court

More Telugu News