Sanjay Dutt: నా భార్య, పిల్లలు దుబాయిలో చిక్కుకుపోయారు: బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌ ఆందోళన

Sanjay Dutt On Staying Away From Family Amid Lockdown
  • నేను ముంబైలో ఉన్నాను
  • భార్యాపిల్లలు ఎలా ఉన్నారోనని భయపడుతున్నాను
  • తదుపరి సినిమాలపై దృష్టిపెట్టాను
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో తన భార్య, పిల్లలు దుబాయిలోనే చిక్కుకుపోయారని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా, ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం తాను ఒక్కడినే ముంబైలోని తన ఇంట్లో ఉంటున్నానని తెలిపాడు. వారు దుబాయిలో సురక్షితంగానే ఉన్నారా? అన్న విషయంపై ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు.

జాగ్రత్తగా ఉన్నారో లేదో అని తెలియని భయంలో ఉన్నానని అన్నాడు. కాకపోతే, తన జీవితంలో ఇలాంటి లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితులను తాను బాగానే చూశానని చెప్పుకొచ్చాడు. తాను ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో క్వారంటైన్‌ విశ్రాంతి తీసుకుంటూనే, తన తరువాతి ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించానని చెప్పాడు.

తన కొత్త సినిమా బిజులోని డైలాగ్స్‌ని ప్రాక్టీస్‌ చేస్తున్నానన్నాడు. కాగా, ఆయన నటిస్తోన్న టోర్‌బాజ్‌ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. యశ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న కేజీఎఫ్‌2లోనూ ఆయన నటించనున్నారు.
Sanjay Dutt
Bollywood
India
Lockdown

More Telugu News