Lockdown: మొబైల్ ప్లాన్ గడువును మరోమారు పొడిగించిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా

Telcos extend its customers prepaid plan validity
  • లాక్‌డౌన్ కారణంగా రీచార్జ్ చేసుకోలేకపోతున్న ఖాతాదారులు
  • ప్రీపెయిడ్ ప్లాన్ గడువు మే 3 వరకు పొడిగింపు
  • దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి లబ్ధి
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో టెలికం కంపెనీలు కూడా ఆ మేరకు వ్యాలిడిటీ గడువును పొడిగించాయి. లాక్‌డౌన్ కారణంగా రీచార్జ్ చేసుకోలేని ఖాతాదారుల ప్రీపెయిడ్ ప్లాన్ గడువును మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటించాయి.

ఈ రెండు సంస్థల తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఖాతాదారులు ఇప్పుడు రీచార్జ్ చేసుకోకపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్‌కమింగ్ కాల్స్‌ను పొందవచ్చు. కాగా, లాక్‌డౌన్ తొలిదశలోనూ టెలికం కంపెనీలన్నీ దాదాపు ప్లాన్ గడువును పొడిగించాయి. బీఎస్‌ఎన్ఎల్, ఐడియా వంటి సంస్థలు పది రూపాయల టాక్‌టైంను కూడా ఉచితంగా అందించాయి.
Lockdown
Telco
Vodafone Idea
Airtel
Prepaid

More Telugu News