Corona Virus: కరోనా తాజా అప్ డేట్స్: దేశంలో 452కి పెరిగిన మరణాలు

Corona has taken many lives in India as the outbreak continues
  • భారత్ లో కరోనా విజృంభణ
  • 13,835కి పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1766
భారత్ లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 13,835కి చేరింది. అటు ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 452కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,616 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1766 మంది కోలుకున్నట్టు తెలిపింది. నిన్నటి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు కాగా, 23 మరణాలు సంభవించాయి. కొన్నిప్రాంతాల్లో కేసులు నమోదు కాకపోవడం ఒక్కటే ఈ సమయంలో ఊరట అని చెప్పాలి.
Corona Virus
India
Deaths
Positive Cases
COVID-19

More Telugu News