Corona Virus: 92 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా కరోనా వైరస్ బతికి ఉంటుంది: ప్రొఫెసర్ రెమీ చారెల్

Corona virus can survive at 92 degress centigrate says prof Remi
  • 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా వ్యాప్తి చెందుతుంది
  • ఈ ఉష్ణోగ్రత వద్ద వైరల్ కౌంట్ మాత్రమే తగ్గింది
  • 92 డిగ్రీల వద్ద 15 నిమిషాలు బతికుంది

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ గురించే చర్చించుకుంటోంది. దీనికి సంబంధించే శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. మరోవైపు, కరోనా వైరస్ ఏ స్థాయి ఉష్ణోగ్రత వరకు బతికి ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఎక్కువ ఉష్ణోగ్రతలో ఆ వైరస్ బతకదని కొందరు చెపుతున్నారు. దీనిపై ఫ్రాన్స్ లోని మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రెమీ చారెల్ మాట్లాడుతూ, కరోనా వైరస్ 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా బతికి ఉంటుందని చెప్పారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా వ్యాపిస్తుందని అన్నారు.

92 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ 15 నిమిషాల పాటు బతుకుతుందని తమ పరిశోధనల్లో తేలిందని రెమీ తెలిపారు. 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గంట సేపు దాన్ని పరిశోధించామని... అప్పుడు దాని వైరల్ కౌంట్ మాత్రమే తగ్గిందని, వ్యాప్తి చెందే శక్తి మాత్రం అలాగే ఉందని చెప్పారు.

56 నుంచి 60 డిగ్రీల మధ్య కరోనా వైరస్ శక్తి కొంత మాత్రమే తగ్గిందని రెమీ తెలిపారు. వైరస్ లు పరిస్థితులకు తగ్గట్టు మార్పు చెందుతూ ఉంటాయని చెప్పారు. యూరప్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News