Varla Ramaiah: ఏం తప్పు చేశాడని బుద్ధా వెంకన్నను బెదిరిస్తున్నారు?: వర్ల రామయ్య

Varla Ramaiah furious over YSRCP leaders
  • వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారన్న బుద్ధా
  • బలహీన వర్గాల నేతలు ప్రశ్నించకూడదా? అంటూ సీఎంపై వర్ల ఆగ్రహం
  • వెంకన్నకు చీమకుట్టినా మీదే బాధ్యత అంటూ స్పష్టీకరణ
వైసీపీ నేతలు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించడం తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. ఏం తప్పు చేశాడని బుద్ధా వెంకన్నను బెదిరిస్తున్నారంటూ ప్రశ్నించారు. బలహీన వర్గాల నేతలు నోరెత్తగూడదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారూ, వెంకన్నకు చీమ కుట్టినా మీదే బాధ్యత అంటూ స్పష్టం చేశారు. వెంటనే ఆయనకు రక్షణ పెంచాలని డిమాండ్ చేశారు. సీఎం గారూ, మీ పాలన ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ పాలెగాళ్ల పాలనను తలపిస్తోంది, ప్రశ్నిస్తే పరాభవం తప్పదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
Varla Ramaiah
Budda Venkanna
Jagan
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News