COVID-19: కోవిడ్‌పై పోరుకు ఇండస్ఇండ్ బ్యాంక్ మద్దతు.. రూ. 30 కోట్ల విరాళం

IndusInd Bank announces 30 cr to covid relief
  • విరాళాన్ని ఎవరికి ఇస్తున్నదీ చెప్పని బ్యాంకు
  • వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
  • పీపీఈలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పిన బ్యాంకు
కరోనా వైరస్‌పై ప్రభుత్వం చేస్తున్న పోరుకు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఇండస్ఇండ్ ముందుకొచ్చింది. 30 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. అయితే, ఈ సొమ్మును ఎవరికి ఇస్తున్నదీ వెల్లడించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని మాత్రం పేర్కొంది.

వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తాము ఇప్పటికే ఫేస్‌మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశామని, కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)లు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, విద్యా షా నేతృత్వంలోని ఎడెల్‌గివ్ ఫౌండేషన్ కూడా జూన్ త్రైమాసికంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చింది.
COVID-19
IndusInd Bank
relief fund

More Telugu News