KTR: కోహ్లీయే భార్యతో హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు, నువ్వెందుకు చేయించుకోకూడదు?: కేటీఆర్

KTR replies in style to a netigen query
  • ఓ నెటిజన్ కు కేటీఆర్ సూచన
  • తన భార్య హెయిర్ కట్ చేస్తానంటోందని కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన నెటిజన్
  • అదే జరిగితే లాక్ డౌన్ ఎత్తేసినా తాను బయటికి రాలేనని ట్వీట్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. శరత్ చంద్ర అనే నెటిజన్ "కేటీఆర్ సర్.. మిమ్మల్ని సిన్సియర్ గా ఓ మాట అడుగుతున్నాను. ఏప్రిల్ 20 తర్వాత బార్బర్ షాపులు, సెలూన్లు తెరిచే ఆలోచన ఏదైనా ఉందా? ఎందుకంటే నాకు క్రాఫ్ చేయాలని నా భార్య ఎంతో తహతహలాడిపోతోంది. అదే గనుక జరిగితే మీరు లాక్ డౌన్ ఎత్తేసినా నేను ఇంటికే పరిమితమైపోతానని గట్టి నమ్మకం" అంటూ ట్వీట్ చేశాడు.

దీనికి కేటీఆర్ బదులిస్తూ "హేయ్, విరాట్ కోహ్లీ అంతటివాడే తన భార్యతో క్రాఫ్ చేయించుకుంటుంటే నువ్వెందుకు చేయించుకోవు?" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఇటీవలే కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో హెయిర్ కట్ చేయించుకుంటున్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
KTR
Netigen
Twitter
Virat Kohli
Haircut
Corona Virus
Lockdown

More Telugu News