Zoom: ‘జూమ్’ యాప్ తో వీడియో కాన్ఫరెన్స్ శ్రేయస్కరం కాదన్న కేంద్ర హోం శాఖ

  •  లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ 
  • భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దు
  • ప్రైవేట్ సంస్థలకు కేంద్ర హోం శాఖ సూచన
Central Home Ministry says  ZOOM APP is not preferable

లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారని, ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర హోం శాఖ సూచించింది.

భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. కాగా, లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి.

More Telugu News