Uttam Kumar Reddy: ధాన్యం సేకరణ కోసం రూ.30 వేల కోట్లు కేటాయించింది నిజమే అయితే గోనె సంచుల కొరత ఎందుకు వచ్చింది?: ఉత్తమ్

Uttam Kumar Reddy questions Telangana Government over farmers issue

  • రైతుల వద్దకే వచ్చి పంటలు కొనుగోలు చేస్తామన్న సీఎం
  • ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సంక్షోభ సమయంలో రైతును ఆదుకోవాలంటూ విజ్ఞప్తి

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాక్ డౌన్ నేపథ్యంలో రైతుల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల నుంచి పంట సేకరణ కోసం రూ.30 వేల కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతోందని, అదే నిజం అయితే ధాన్యం సేకరణ కేంద్రాల్లో గోనె సంచుల కొరత ఎందుకు వచ్చిందని అడిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై ఇతర పార్టీలతో కలిసి ఎలుగెత్తుతోందని ట్వీట్ చేశారు.

పంట కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, రైతు నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ సంక్షోభ సమయంలో రైతును ఆదుకోవాలని కోరారు. అంతకుముందు, సీఎం కేసీఆర్ లాక్ డౌన్ అమలు గురించి మాట్లాడుతూ, రైతుల వద్దకే వచ్చి పంటలు కొనుగోలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News