టాలీవుడ్ సినీ కార్మికుల కోసం రూ.2 లక్షల విరాళం ప్రకటించిన కాజల్
- లాక్ డౌన్ తో ఉపాధి కరవైన సినీ కార్మికులు
- సీసీసీకి విరాళం అందించాలని నిర్ణయించుకున్న కాజల్
- ఇప్పటికే సీసీసీకి భారీగా విరాళాలు ప్రకటించిన అగ్రనటులు
లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలు స్థంభించిపోయాయి. చిత్ర ప్రదర్శనలు నిలిచిపోవడమే కాదు, షూటింగులు కూడా ఆగిపోయాయి. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పనిలేక అవస్థలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు అగ్రనటులు భారీ విరాళాలు ప్రకటించారు.