కరోనా రాకుండా గుండు చేయించుకుంటున్న గ్రామస్థులు
- నిర్మల్ జిల్లాలోని ముధోల్ మండలం చింతకుంట తండాలో ఘటన
- పూజలు చేసిన యువకులు
- ఇలా చేయడం హిందూ సంప్రదాయమని వ్యాఖ్య
ముధోల్ మండలం చింతకుంట తండాలో 25 మంది యువకులు కులదైవానికి పూజలు చేసి, గుండు చేయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు గుండు కొట్టించుకుని ఫొటోలు కూడా దిగారు. ఇలా చేస్తే కరోనా రాదని వారు ఎంతో నమ్మకంగా చెప్పడం గమనార్హం.
ఇలా చేస్తే తమ గ్రామంలోనూ కరోనా రాదని ఓ గ్రామ పెద్ద మీడియాకు తెలిపాడు. హిందూ సంప్రదాయం ప్రకారం పుణ్య క్షేత్రాలకు వెళ్లినా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా గుండు చేయించుకుంటామని, అదే ఆచారం ప్రకారం కరోనా రాకుండా ఇప్పుడు గుండు చేయించుకుంటున్నామని చెప్పాడు. కుల దైవాలకు భక్తి, శ్రద్ధలతో పూజలు కూడా జరిపించామని తెలిపాడు.