KCR: కేసీఆర్ గారి లాంటి లీడర్స్ వజ్రాల్లా మెరుస్తారు: నాగబాబు

Nagababu Praises KCR
షార్ట్స్‌లో చూడండి
ఇటీవలి కాలంలో కేసీఆర్ సమావేశాలు చూస్తున్నా, ఆయన ప్రసంగాలు వింటున్నా ఎంతో ఆనందం కలుగుతూ, ఆయనపై అభిమానం పెరిగిందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఈ మధ్య కేసీఆర్ మీటింగ్ లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎం లు ఉన్న దేశంలో కేసీఆర్  గారిలాంటి లీడర్స్ వజ్రాల్లా మెరుస్తారు" అని ప్రశంసల వర్షం కురిపించారు.
Go Back to Shorts
KCR
Nagababu
Twitter

More Telugu News