Maulana saad: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు నమోదు

  • భౌతిక దూరం నిబంధన గాలికి వదిలేసి సదస్సు
  • పలువురి మరణాలకు కారణమయ్యారని ఆరోపణ
  • పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
Maulana saad booked in Murder case

దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ నేత మౌలానా సాద్ కాంధ్వలీపై నేరపూరిత హత్య కేసు నమోదైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను గాలికి వదిలేసి మతపరమైన సదస్సు నిర్వహించిన ఆయనపై ఈ మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ సదస్సు నిర్వహించిన తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు, సదస్సుకు హాజరైన వారిలో చాలామంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఘటన కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూశాయి. నిజాముద్దీన్ పోలీస్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సాద్‌పై సెక్షన్ 304 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిపైనా వీసా నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.

More Telugu News