Surya: నేరుగా తెలుగు సినిమా చేసే ప్రయత్నంలో సూర్య

Surya Movie
  • తెలుగులోను సూర్యకి క్రేజ్
  • కొంతకాలంగా ఇక్కడ దక్కని సక్సెస్
  • తెలుగు దర్శకులతో టచ్ లో వున్న సూర్య
తమిళంతో పాటు తెలుగులోను సూర్యకి మంచి క్రేజ్ వుంది. ఒక తెలుగు హీరోగానే ఆయనను ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అందువల్లనే ఆయన తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. అయితే కొంతకాలంగా తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఈ నేపథ్యంలో నేరుగా తెలుగులోనే ఒక సినిమా చేసి ఇక్కడ తన స్థానాన్ని పదిలపరచుకోవాలనే ఆలోచనలో సూర్య వున్నాడు. కొంతకాలంగా ఇక్కడి రచయితలతో .. యువ దర్శకులతో ఆయన టచ్ లోనే వుంటున్నట్టుగా తెలుస్తోంది. వీలైనప్పుడల్లా ఆయన తెలుగు కథలను వింటున్నాడని అంటున్నారు. కథ నచ్చితే తన సొంత బ్యానర్లోనే చేయాలనే గట్టి నిర్ణయంతోనే ఆయన వున్నాడని చెబుతున్నారు. ఆయన ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి.
Surya
Actor
Tollywood

More Telugu News