Karnataka: మాజీ సీఎం కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ గౌడ పెళ్లికి ఏర్పాట్లు

Hero Nikhil Gouda marriage arrangements are going on
  • ఈ నెల 17న నిఖిల్-రేవతిల పెళ్లి
  • పెళ్లికి హాజరయ్యేది వధూవరుల తరఫు కుటుంబసభ్యులు మాత్రమే
  • పెళ్లి కూతురు నివాసంలో జరగనున్న వివాహం  
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ  ఈ నెల 17న  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ గౌడ పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ పెళ్లికి కేవలం వధూవరుల తరఫు కుటుంబసభ్యులు తక్కువ సంఖ్యలో మాత్రమే హాజరు కానున్నారు.

బెంగళూరులోని విజయ్ నగర్ లోని పెళ్లికూతురు నివాసంలో వివాహం జరగనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో జేడీఎస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా పెళ్లికి రావద్దని కుమారస్వామి కోరారు. లాక్ డౌన్ అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సమాచారం. కాగా,  కాంగ్రెస్ నేత క్రిష్ణప్పకు మనవరాలు వరుస అయ్యే రేవతిని నిఖిల్ గౌడ పెళ్లి చేసుకోనున్నాడు.
Karnataka
ex-cm
Kumaraswamy
son
Nikhil
marriage

More Telugu News