Telangana: తెలంగాణలో కరోనా తాజా కేసుల సంఖ్య ఇదీ.. వెల్లడించిన ఆరోగ్యశాఖ

Another 37 corona cases registered today in Telangana
  • నేడు కొత్తగా మరో 37 కేసుల నమోదు
  • మొత్తంగా 681కి చేరిన కేసుల సంఖ్య
  • ప్రాణాలు కోల్పోయింది 18 మంది
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే 52 కేసులు నమోదు కాగా, తాజాగా గత 24 గంటల్లో మరో 37 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 681కి పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం బాధితుల్లో 118 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఆసుపత్రుల్లో ఇంకా 545 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
Telangana
Corona Virus
Hyderabad

More Telugu News