Maharashtra: ముంబైని వణికిస్తున్న మహమ్మారి వైరస్.. నేడు మరో 183 కేసుల నమోదు

183 New cases recorded in Mumbai today
  • మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో సగం ముంబైలోనివే
  • తాజాగా మరో ఇద్దరి మృతి
  • నగరంలో 1936కు పెరిగిన బాధితుల సంఖ్య
కరోనా వైరస్ మహమ్మారి ముంబైని భయపెడుతోంది. అత్యధిక మంది బాధితులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, అందులో సగం కేసులు రాజధాని ముంబైలోనే నమోదవుతుండడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది.

తాజాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 183 కేసులు నమోదయ్యాయి. అలాగే, నగరానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ముంబైలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1936కు పెరిగినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. ఇప్పటి వరకు నగరంలో 113 మంది ప్రాణాలు కోల్పోగా, 181 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు.
Maharashtra
Mumbai
Corona Virus
corona deaths

More Telugu News