Sensex: బ్యాంకింగ్ స్టాకులపై ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ప్రారంభంలో భారీ లాభాలు.. తర్వాత నష్టాలు  
  • 310 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 68 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses due to profit booking

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 878 పాయింట్ల వరకు లాభపడింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, ఆటో షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 310 పాయింట్లు నష్టపోయి 30,379కి పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 8,925కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (6.07%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.95%), ఐటీసీ (4.29%), నెస్లే ఇండియా (4.27%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.77%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-6.23%), హీరో మోటోకార్ప్ (-4.76%), బజాజ్ ఫైనాన్స్ (-4.63%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.61%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.57%).

More Telugu News