NagaBabu: బిస్కెట్లు వేయవద్దంటూ 'జబర్దస్త్' అవినాశ్ కి నాగబాబు పంచ్

Nagababu
  • యూ ట్యూబ్ ఛానల్లో నాగబాబు లైవ్ చాట్
  • టచ్ లోకి వచ్చిన అవినాశ్
  • ఎవరి అవకాశాలు వారివన్న నాగబాబు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో అవినాశ్ ఒకరు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. సాయికుమార్ వంటివారిని ఎక్కువగా అనుకరిస్తూ నాన్ స్టాప్ గా నవ్వించడం అవినాశ్ ప్రత్యేకత. అలాంటి అవినాశ్ కి తాజాగా నాగబాబు నుంచి ఒక పంచ్ పడింది.

నాగబాబు తన యూ ట్యూబ్ చానల్లో లైవ్ చాట్ చేస్తూ ఉండగా, టచ్ లోకి వచ్చిన అవినాశ్, 'నేను మాట్లాడుతున్నది వరుణ్ తేజ్ తోనా? నాగబాబుగారితోనా? అర్థం కావడం లేదు' అన్నాడు. ఆ మాటకి నాగబాబు స్పందిస్తూ .. 'అరేయ్ .. నేనిప్పుడు 'జబర్దస్త్' చేయడం లేదు .. నాకు బిస్కెట్లు వేయడం వలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వెళ్లి శేఖర్ మాస్టర్ కో .. రోజాకో వేసుకో .. ఉపయోగం ఉంటుందేమో' అన్నారు. తనకి ఎవరిపై శత్రుత్వం .. పగ .. ప్రతీకారాలు ఉండవనీ, ఎవరి అవకాశాలు వారివని ఇదే లైవ్ చాట్ లో ఆయన చెప్పుకొచ్చారు.
NagaBabu
Avinash
Jabardasth

More Telugu News