KTR: ‘నాట్కో’ విరాళంపై కేటీఆర్ ధన్యవాదాలు

Minister Ktr thanks to NATCO
  • ‘కరోనా’పై చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిచిన నాట్కో 
  • విరాళం కింద.. రూ.2.50 కోట్ల విలువైన  పీపీఈ కిట్స్
  • రూ.1.50 కోట్ల విలువైన మందులు, పరికరాలు కూడా
కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నాట్కో ఫార్మా లిమిటెడ్ తమ వంతు సాయం ప్రకటించింది. రూ.2.50 కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్  ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్స్ ను, రూ.1.50 కోట్ల విలువైన మందులు, పరికరాలను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా  నాట్కోకు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్-19పై పోరాటానికి ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
KTR
TRS
Telangana
NATCO
Corona Virus

More Telugu News