Corona Virus: లాక్‌డౌన్‌ ఎత్తివేసేముందు ఇలా చేయండి.. దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ సూచన

WHO releases six criteria for lifting lockdown
  • ఆరు ప్రమాణాలు నిర్దేశించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 
  • వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చాకే నిర్ణయం తీసుకోవాలి
  • అదనపు వైద్య సదుపాయాలు సమకూర్చాలని సలహా

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్ అయ్యాయి. మరెన్నో ఆంక్షలు అమలవుతున్నాయి. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో  పలు దేశాలు ఆంక్షలు సడలించే దిశగా  ఆలోచిస్తున్నాయి. అయితే, లాక్‌డౌన్‌ను ఎత్తేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  సూచించింది. ఈ మేరకు ఆరు ప్రమాణాలతో  ప్రకటన విడుదల చేసింది.

‘ దేశంలో వైరస్ వ్యాప్తి  పూర్తిగా అదుపులోకి రావాలి. కరోనా కేసులను ట్రాక్ చేసేందుకు అదనపు వైద్య  సదుపాయాలు సమకూర్చాలి. రోగులకు మెరుగైన చికిత్స అందించి వారికి ఐసోలేషన్‌  సౌకర్యం కల్పించాలి.  వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నర్సింగ్ హోమ్స్‌ వంటి  ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. స్కూళ్లు, పని ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కొత్త నిబంధనలకు ప్రజలు అలవాటు పడే వరకు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.

కొన్ని దేశాలు పలు వారాల పాటు సామాజిక, ఆర్థిక ఆంక్షలు భరించాయని, మరికొన్ని దేశాలు ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేయాలో పరిశీలిస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోమ్ అన్నారు. అయితే, మానవ ఆరోగ్యం, వైరస్ స్పందనను ఆధారంగా చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News