Vijay: విజయ్ పుట్టినరోజునాడే 'మాస్టర్' రిలీజ్?

Master Movie
  • లోకేశ్ కనగరాజ్ నుంచి 'మాస్టర్' సినిమా
  • త్వరలో ట్రైలర్ వదిలే ఆలోచనలో దర్శక నిర్మాతలు
  • జూన్ 22వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయం
విజయ్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'మాస్టర్' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జూన్ 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం. ఆ రోజున విజయ్ పుట్టినరోజు కావడంతో, దర్శక నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు.

ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా వున్నారు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ట్రైలర్ ను వదలడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వున్నారని తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ట్రైలర్ వదలడమే కరెక్ట్ అనే ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.
Vijay
Malavika Mohanan
Lokesh Kanagaraj Movie

More Telugu News