Varla Ramaiah: ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ రుణం తీర్చుకునేందుకు తొందరపడుతున్నట్లున్నారు: టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా

varla ramayya setaire on SEC in twitter
షార్ట్స్‌లో చూడండి
తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన ఏపీలోని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రుణం తీర్చుకునేందుకు జస్టిస్‌ కనగరాజ్‌ తొందరపడుతున్నట్లున్నారని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. అందుకే ఆయన హడావుడిగా బాధ్యతలు చేపట్టినట్లున్నారన్నారు.  ఈ పరిస్థితుల్లో ఆయన ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహిస్తారనుకోవడం అత్యాశ అవుతుందేమోనని ట్వీట్‌ చేశారు.  

‘రాష్ట్ర ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్థానిక ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడడం ఆశ్చర్యమే. ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చునని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.
Go Back to Shorts
Varla Ramaiah
justice kanagaraju
Local Body Polls
Twitter

More Telugu News