Saurav Ganguly: ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది: గంగూలీ

  • బీసీసీఐ చీఫ్ పదవిపై గంగూలీ వ్యాఖ్యలు
  • బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం మిగిలిన పదవీ కాలం మరో మూడు నెలలే
  • తమ చేతుల్లో ఏమీ లేదన్న దాదా
Saurav Ganguly Speaks About BCCI Chief post

బీసీసీఐ అధ్యక్ష పదవిపై ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుందని సౌరవ్ గంగూలీ అన్నాడు. బోర్డు చీఫ్‌గా ఇప్పటికే ఆరు నెలల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న గంగూలీ.. బోర్డు రాజ్యాంగం ప్రకారం మరో మూడు నెలలు మాత్రమే పదవిలో కొనసాగే అవకాశం ఉంది.

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా రాష్ట్ర క్రికెట్ సంఘంలో కానీ, బీసీసీఐలో కానీ, లేదంటే రెండింట్లో కలుపుకుని ఆరేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి మూడేళ్లపాటు కచ్చితంగా విరామం తీసుకోవాల్సిందే. బీసీసీఐ చీఫ్ కావడానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్)లో సంయుక్త కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ‘దాదా’ మొత్తంగా ఐదు సంవత్సరాల మూడు నెలలు పనిచేశాడు. ఆ తర్వాత బీసీసీఐ చీఫ్ అయ్యాడు.

ఈ పదవిలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. అంటే గంగూలీకి మిగిలి వున్నది ఇక మూడు నెలలే. అయితే, బీసీసీఐ చీఫ్‌గా పూర్తికాలం పనిచేసేందుకు వీలు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ ఇటీవల గంగూలీ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కోర్టులు పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయం సందిగ్ధంలో పడింది. తాజాగా ఈ విషయమై గంగూలీ మాట్లాడుతూ.. కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నాడు. ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుందని, తమ చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేశాడు.

More Telugu News