రేపు 74 లక్షలకు పైగా ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ: కేటీఆర్

13-04-2020 Mon 22:00
  • లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో నిరుపేదలు
  • మొత్తం రూ.1,112 కోట్లు కేటాయించామన్న కేటీఆర్
  • ఆ మొత్తాన్ని ఇప్పటికే బ్యాంకులకు బదిలీ చేశామని వెల్లడి
KTR said around seventy four plus lakh bank accounts in Telangana will be credited tomorrow

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో నిరుపేదలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి కొద్దిమేర ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. రేపు 74 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

 లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు.