Asaduddin Owaisi: గుంటూరు మౌలానా హబీబుల్లా మృతి పట్ల అసదుద్దీన్ ఒవైసీ సంతాపం

Asaduddin Owaisi says Andhra Pradesh will follow WHO Guidelines on burials and cremations
  • ఎంతో విచారానికి లోనయ్యానన్న ఒవైసీ
  • హబీబుల్లా ఎంతో హుందాతనం ఉన్న వ్యక్తి  
  • హామీ ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు  
గుంటూరుకు చెందిన మౌలానా హబీబుల్లా మృతి చెందారన్న వార్తతో తాను ఎంతో విచారానికి లోనయ్యానని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మౌలానా హబీబుల్లా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడని, హుందాతనం మూర్తీభవించిన వ్యక్తి అని కీర్తించారు. ఆయన మృతి సందర్భంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఆయనను ఖననం చేస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఖననాలు, దహన సంస్కారాల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తుందని సీఎం తనకు హామీ ఇచ్చారని అసద్ చెప్పారు.
Asaduddin Owaisi
Andhra Pradesh
WHO
Jagan
Maulana Habibullah
Demise
Burial

More Telugu News