Tamilnadu: తమిళనాడులో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Lockdown in Tamil Nadu extended by CM Edappadi K Palaniswami
  • ప్రకటించిన సీఎం పళనిస్వామి
  • రేపటితో ముగియనున్న కేంద్రం విధించిన లాక్ డౌన్
  • లాక్ డౌన్ ను పొడిగిస్తున్న అనేక రాష్ట్రాలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడులో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటన చేశారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ రేపటితో ముగుస్తుండగా, ప్రధాని మోదీ తదుపరి ప్రకటన రాకముందే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నాయి. తాజాగా జాబితాలో తమిళనాడు కూడా చేరింది. తమిళనాడులో ఇప్పటివరకు 982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 50 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు.
Tamilnadu
Lockdown
Corona Virus
Palaniswami
Extension

More Telugu News