ఏపీలో మరింతగా పెరిగిన కరోనా కేసులు!

13-04-2020 Mon 11:25
  • ఒక్క రాత్రిలో కొత్తగా 12 పాజిటివ్ లు
  • గుంటూరు జిల్లాలో 8 కొత్త కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య 432
More New Corona Cases in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. గత రాత్రి జరిగిన పరీక్షల్లో కొత్తగా 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 8, చిత్తూరులో 2, కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి.

కొత్తగా నమోదైన 12 కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 432కి పెరిగింది" అని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కొనసాగుతున్నాయన్న సంగతి తెలిసిందే. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 90 కేసులుండగా, కర్నూలు జిల్లా రెండో స్థానంలో 64 కేసులతో ఉంది.