అదే నేను చేసిన పొరపాటు: హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్

13-04-2020 Mon 11:00
  • గ్లామర్  పరంగా మంచి క్రేజ్
  • సక్సెస్ ల పరంగా కలిసిరాని కాలం
  • అనుభవలేమి కారణమన్న అనూ
Anu Emmanuel

తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే ఆమె పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ జోడీ కట్టే అవకాశాలను అందుకోగలిగింది. అయితే ఆ సినిమాలతో పాటు ఆమె నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా పరాజయం పాలైంది. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ .. "కెరియర్ తొలినాళ్లలో నాకు ఎలాంటి పాత్రలను ఎంచుకోవాలో తెలియలేదు. నా పాత్ర వరకే విని కథ మొత్తం వినని సందర్భాలు వున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో పొరపాటు జరిగితే, మరికొన్ని ప్రాజెక్టులను వదులుకుని తప్పుచేశాను. ఇదంతా అనుభవలేమి వల్లనే జరిగింది. అందువల్లనే ఇప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.