Hyderabad: ఖైరతాబాద్‌లో ఆరు మార్గాల్లో రాకపోకలకు అనుమతి

Khairathabad roads reopened
  • కొన్ని వీధుల్లో మాత్రం పరిమిత నియంత్రణ
  • ఇక్కడి ఓ కాలనీలో కరోనా మరణం నమోదు
  • దీంతో కఠిన ఆంక్షలు అమలు  చేసిన పోలీసులు
ఓ కాలనీలో చోటు చేసుకున్న కరోనా మరణాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించారని వచ్చిన విమర్శలకు స్పందిస్తూ పోలీసులు ఖైరతాబాద్‌లోని ఆరు రోడ్లలో బారికేడ్లను తొలగించి స్థానికంగా రాకపోకలను పునరుద్ధరించారు. కొన్ని వీధుల్లో మాత్రం పరిమిత నియంత్రణ పాటిస్తున్నారు.

ఖైరతాబాద్‌లోని ఓ కాలనీలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా, ఆ తర్వాత అతను చనిపోయాడు. కరోనాతో రాష్ట్రంలో జరిగిన తొలి మరణం ఇది. దీంతో ఖైరతాబాద్‌ ప్రాంతంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. మొత్తం ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా ప్రకటించి అన్ని దారులు మూసివేశారు. అయితే ఇదికాస్త ఇబ్బందిగా మారడం, విమర్శలు వ్యక్తం కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కాలనీలోని కొన్ని వీధుల్లో మాత్రం నియంత్రణ అమలు చేస్తున్నారు.
Hyderabad
Khairathabad
blocked roads
reopened

More Telugu News